అటో, ఇటో తేల్చుకోండి: దగ్గుబాటి ఫ్యామిలీకి వైసీపీ అల్టిమేట్టం

10-10-2019 Thu 06:38 | Both States
  • బీజేపీలో కొనసాగుతున్న పురందేశ్వరి
  • ఇబ్బందిగా ఉందని భావిస్తున్న వైఎస్ఆర్ సీపీ
  • ఏదో ఓ పార్టీనే ఎంచుకోవాలని దగ్గుబాటికి చెప్పిన అధిష్ఠానం
గడచిన ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన భార్య పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగేందుకు అభ్యంతరం చెప్పని వైసీపీ, ఇప్పుడు ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని, పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని దగ్గుబాటిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

జగన్ సీఎం అయిన తరువాత, బీజేపీ ఏపీ సర్కారుపైనా, జగన్ పైనా చేస్తున్న విమర్శలకు పదును పెట్టగా, పురందేశ్వరి కూడా అదే బాటలో నడుస్తూ, వీలుచిక్కినప్పుడెల్లా జగన్ ను విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కాక రేపుతోంది. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని వైసీపీ అధిష్ఠానం అల్టిమేట్టం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా, జగన్ తో మాట్లాడాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ లభించడం లేదని సమాచారం. గతంలో పరుచూరులో వైసీపీ ఇన్ చార్జ్ గా ఉండి, దగ్గుబాటి చేరిక తరువాత, టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాథం బాబు, ఎన్నికల తరువాత తిరిగి వైసీపీలో చేరారు. ఆపై ఆయనే నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ పనులన్నీ ఆయనకే అప్పగిస్తున్నారు కూడా.

ప్రస్తుతం హైదరాబాద్ లో  ఉన్న దగ్గుబాటి, తన అనుచరులతో మొత్తం పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అపాయింట్ మెంట్ లభిస్తే, వెళ్లి అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలన్నది దగ్గుబాటి ఆలోచనని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
DaggubatiJaganYSRCPPurandeshwari

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more